Monday, September 26, 2011

'సకలం' మిథ్య అంటే సరిపోతుందా?

ఏదైనా ఒక ఉద్యమం మంచిదా చెడ్డదా అన్న ప్రశ్న వేసుకుని వారి వారి ఇష్టాన్ని బట్టి ఏ సమాధానమైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది అభిప్రాయం మాత్రమే. కానీ ఏదైనా ఉద్యమం ఉధృతంగా సాగుతోందా, చప్పగా జరుగుతోందా అన్న ప్రశ్న వేసుకుని ఇష్టమొచ్చిన అభిప్రాయం చెప్పుకోవడానికి కుదరదు. ఎందుకంటే, అక్కడ వాస్తవం చెప్పాలి.

మూడున్నర లక్షల మంది రాష్ట్రప్రభుత్వోద్యోగులు, లక్షన్నర మంది ఉపాధ్యాయులు, అరవైఏడు వేల మంది సింగరేణికార్మికులు, యాభై ఎనిమిదివేల మంది ఆర్టీసీ కార్మికులు, ఇంకా ప్రభుత్వాసుపత్రుల వైద్యులు సమ్మెలో ఉన్నారు. ఇంకా ఆటోడ్రైవర్లు, పూజారులు, రజకులు, భవన నిర్మాణ కార్మికులు, పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ డ్రైవర్లు సంఘీభావ సమ్మెలు చేస్తున్నారు. రోజుకో సమూహం కొత్తగా వచ్చి ఆందోళనలో చేరుతున్నది.ఏకకాలంలో సమ్మెచేసి జనజీవనాన్ని స్తంభింపజేసిన ఇటువంటి ఉద్యమం గతంలో ఎప్పుడైనా ఏ సమస్యల పరిష్కారం కోసమైనా జరిగిందా? ఇన్ని రోజులు నిలకడగా సాగిందా? ఉద్యమం తీరు మీద, నాయకత్వం మీద ఎన్ని విమర్శలు, విభేదాలు ఉన్నప్పటికీ-సమాజంలోని ఇన్ని వర్గాలు, శ్రేణులు ఒక్కుమ్మడిగా ఒక ఆకాంక్ష సాధన కోసం ఉద్యమించడం మునుపు ఎన్నడైనా విన్నామా? తెలంగాణ ఉద్యమం గురించి ఎటువంటి అభిప్రాయం ఉన్నవారైనా, ఇప్పటి సకలజనుల సమ్మె తీవ్రతను, ఉధృతిని అంగీకరించడానికి అభ్యంతరం ఉండకూడదు. ఎందుకంటే, హైదరాబాద్ వీధుల దగ్గర నుంచి, ఆదిలాబాద్ అడవుల దాకా వాస్తవమేమిటో కళ్ల ఎదుట కనిపిస్తున్నది. మరి రేణుకాచౌదరికీ, అభిషేక్ సింఘ్వికి సమ్మె ప్రభావం ఏమీ లేదని ఎందుకు అనిపించింది? ఇదంతా చల్లారిపోయే వేడి అని ముఖ్యమంత్రిగారికి ఎందుకు అనిపిస్తోంది?

చల్లారిపోవచ్చు. ఏ విజయమూ లేకుండానే అణగారిపోవచ్చు. కానీ, ముగిసిపోయిందనుకున్నది మళ్లీ మళ్లీ మొలుచుకు వస్తున్నప్పుడు, ఇది ఇంతటితో ఆగేదికాదన్న కనీస అవగాహన ఉండాలి. అణచివేతతోనో, అసహాయతలోనో ఆందోళనలు విరమించుకున్నప్పటికీ, ఆకాంక్షలు నెరవేరని ఆశాభంగం, కనీస స్పందన కూడా దొరకని అరణ్యరోదనం- ఆయా జనవర్గాల మనసులో ఎటువంటి ఉద్వేగాలకు, ఆవేశాలకు
కారణమవుతాయో- సమాజానికి బాధ్యతవహించేవారికి తెలిసి ఉండాలి. గుంపును చెదరగొట్టి విజయం సాధించామని పోలీసులు అనుకోవచ్చు, సమ్మెను చెదరగొడితే సమస్య సమసిపోతుందని ప్రభుత్వాధినేతలు అనుకుంటే అది న్యాయం కాదు. మీరు వ్యక్తం చేస్తున్న ఆకాంక్షను ఆలకించాము, సమస్యను పైవారికి నివేదిస్తాము, పరిష్కారం సత్వరం జరిగేటట్టు మా ప్రయత్నం మేం చేస్తాము- అని చెప్పవలసింది పోయి, సమ్మె వల్ల కలుగుతున్న కష్టాలను చూపించి, చట్టాలతో భయపెట్టి, తాయిలాలతో ఆశపెట్టి సంక్షోభాన్ని గట్టెక్కాలనుకోవడం అంత గొప్ప పరిపాలనా వ్యూహమూ, రాజకీయ విజ్ఞతా కావు.

మరి సమ్మె వల్ల కష్టాలు లేవా? చాలా ఉన్నాయి. లెక్కలేనన్ని ఉన్నాయి. సమ్మె ఎట్లా పరిణమిస్తుందో తెలియదు కానీ, నెలాఖరుకు జీతాలు వచ్చే ఆశ లేదు. వచ్చే నెల దసరా దీపావళి పండగలు. పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. పదోతరగతి, ఇంటర్ పిల్లల తల్లిదండ్రులకయితే మరీ టెన్షన్. రోడ్ల మీద చిల్లర వ్యాపారం దెబ్బతింటున్నది. షోరూమ్‌లలో అమ్మకాలూ పడిపోయాయి. రవాణా సదుపాయం లేక రోగులు మెరుగైన వైద్యం పొందలేకపోతున్నారు. సింగరేణి సమ్మె ప్రభావం నిజంగా మొదలయిందో ప్రభుత్వం మాయచేస్తోందో తెలియదు కానీ, ఇవాళ కాకపోతే రేపయినా విద్యుత్‌కొరత విరుచుకుపడుతుంది. ఇప్పటికే గృహవినియోగం కోత పడింది. సమ్మె పేరు చెప్పి సేద్యానికీ కోతవేయవచ్చు. జీవితం స్తంభించడం అంటే ఏమిటో తెలంగాణ జిల్లాలను చూస్తే తెలుస్తుంది. ఏ సమ్మెకైనా బాధితులంటూ ఉంటే వారు ప్రధానంగా స్థానికులే అయి ఉంటారు. అలాగే, ఈ సకల జనుల సమ్మె కూడా తెలంగాణ సకల జనులను ఇబ్బందులు పెట్టడంలో ఆశ్చర్యమూ అసహజమూ ఏమీ లేదు.

మరి తెలంగాణ వారు తమను తాము ఎందుకు బాధించుకుంటున్నారు? సమ్మె చేసేవారూ బాధలు పడేవారూ వేరువేరా? ప్రభుత్వోద్యోగులకూ సింగరేణి కార్మికులకూ కుటుంబాలూ పిల్లలూ వాళ్ల చదువులూ అన్నీ ఉంటాయి. కరెంటు కోత వస్తే అందుకు బాధితులయ్యేవారిలో ఉద్యమకారులూ ఉంటారు. అంతెందుకు, వీరందరూ జీతాలు కోల్పోవడానికి, ప్రభుత్వ చర్యలకు సిద్ధపడే సమ్మెకు దిగారు కదా? తమను తాము బాధించుకుంటున్నామని వారికి తెలియదా? గొప్పదని తాము అనుకున్న ఆశయాన్ని సాధించడానికి వాళ్లు ఆ ఇబ్బందులు పడడానికి సిద్ధపడి ఉద్యమిస్తున్నారు. ఇది మీకే నష్టం, మీకే కష్టం- అనడమంటే, ఉద్యమాలు ఎట్లా జరుగుతాయో, ఏ ఏ సంసిద్ధతలతో జరుగుతాయో తెలియని అజ్ఞానమే అవుతుంది. తమను తాము కాకుండా ఇతరులను మాత్రమే బాధించే ఉద్యమాలు చేస్తే, ఈ విమర్శకులు ఆహ్వానిస్తారా? అప్పుడు వాటిని మరో పేరుతో పిలవరా?

ఒక అపూర్వమైన ప్రజాందోళనతో వ్యవహరించవలసిన తీరు ఇది కాదు. ఆ ఆందోళన ఆశయాలతో ఏకీభావం లేకున్నా, ఇందులో పాల్గొంటున్న విస్త­ృత ప్రజారాశిని మొదట గౌరవించాలి. తరువాత ప్రజాస్వామికంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అందుకు జరగవలసింది- ముందు ఉద్యమం ఉనికిని గుర్తించాలి. కళ్లుమూసుకుంటే మాయమయిపోయేది కాదు, ఈ ఉద్యమం. ఉధృతంగా లేదనుకుంటే, బలహీనపడిందనుకుంటే, మెజారిటీ ప్రజలు ఇందుకు సుముఖంగా లేరనుకుంటే, అది ఆత్మసంతృప్తిని ఇవ్వవచ్చు, ఇతర ప్రజానీకాన్ని మభ్యపెట్టడానికి పనికిరావచ్చు. కళ్లెదుట కనిపిస్తున్న వాస్తవాన్ని నిరాకరిస్తూ,సబ్ ఠీక్ హై అనుకుంటే, అది ఉష్ట్రపక్షి మనస్తత్వమే అవుతుంది. ఉద్యమం ఉనికిని గుర్తించడం మాత్రమే కాదు, అందులో కనిపించే మంచిలక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 1969 నాటి ఉద్యమం ఇంత కంటె తీవ్రతతో సాగింది. సందేహం లేదు. నెలల తరబడి విద్యాలయాలు మూతబడ్డాయి, వీధులు రణరంగంగా మారాయి. హింసాత్మక సంఘటనలూ జరిగాయి. నేటి ఉద్యమంలో అంత తీవ్రత కనిపించకపోవచ్చు, కానీ విస్త­ృతి కనిపిస్తుంది. నాటితో పోలిస్తే, అనేక రెట్లు జనం ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు కానీ, నేటి సంయమనం, నిగ్రహం నాడు లేవు. ఇన్ని శ్రేణులు, ఇన్ని సంఘాలు, ఇన్ని ఐక్యవేదికలు ఒకే ఉద్యమంలో అంతర్భాగంగా ఉన్నా, ఏ వైపు నుంచి కూడా హద్దుమీరిన దాఖలాలు లేవు. కానీ, ఉద్యమమే మిథ్య అనేవారు ఒకవైపు, ఉన్న ఉద్యమం ఉద్రేకాలను రెచ్చగొడుతున్నదనేవారు మరోవైపు- వీరు వాస్తవాన్ని ఎవరి నుంచి దాచిపెడుతున్నారు? వీరి మాటలు నమ్మితే, మోసపోయేది ఎవరు?

అటూ ఇటూ ప్రగల్భ శూరులు లేరని కాదు. ఆచరణకు ప్రత్యామ్నాయంగా ఆవేశప్రకటనలను ఒక పద్ధతిగా పాటిస్తున్న వారు అన్ని వైపులా ఉన్నారు. కానీ, నిజంగా జనం అటువంటి మాటల వల్ల ఉద్రిక్తులవుతారా? ప్రాణాలిస్తామని చెప్పేవాళ్లు పదవులుకూడా వదలరని, ఆత్మాహుతి దాడులు చేస్తామనేవారి కాళ్లు గడప కూడా దాటవని, దళాలు ఏర్పాటు చేస్తామనడం, ఊచకోతలు కోస్తామనడం, నాలుక తీస్తామనడం- కేవలం వేదికలమీద వాగాడంబరాలేనని జనానికి తెలియదా? ఆ మాటల వల్ల కాదు కానీ, నిర్ణయాలు తీసుకోవలసినవారి నిర్లిప్తత వల్ల, సత్యం చెప్పవలసినవారి నోట అసత్యాల వల్ల, కనిపిస్తున్న వాస్తవానికి కళ్లు మూసుకోవడం వల్ల - ఉద్రిక్తతలు చెలరేగుతాయి.   ప్రజాస్వామ్య బద్ధంగా, శాంతియుతంగా చేయగలిగినంత చేస్తున్న ఉద్యమానికి పాషాణహృదయమే సమాధానమైతే, అది ఎంతటి నిస్ప­ృహను, తెగింపును కలిగిస్తుందో ఏలినవారికి తెలియవద్దా? రెచ్చగొట్టడానికి మాటలే కానక్కరలేదు. మౌనం చాలు. నిర్లిప్తత చాలు. శాంతపరచడానికి అన్ని వేళలా పూర్తిపరిష్కారమే అక్కరలేదు, కాసింత సానుభూతి, కొన్ని అనునయవాక్యాలు చాలు. ఆశను మిగిలిస్తే చాలు. ఒక అడుగైనా ముందుకు పడితే చాలు.

ఇంతటి మహోద్యమానికి పాలకుల ప్రతిస్పందన ఇట్లా ఉంటే, ఉద్యమప్రజలకు ప్రాతినిధ్యం వహించే నేతల ధోరణి మరీ దారుణంగా ఉంది. చిన్న పాటి సాంత్వన వాక్యం, కొద్దిగా సంఘీభావం, కాసింత నిజాయితీ కనబరస్తే చాలు, గజమాల వేయడానికి సిద్ధంగా ఉన్నారే ప్రజలు, చరిత్ర కల్పించిన అవకాశానికి ఎందుకింత పెడమొహం పెడుతున్నారు? రాష్ట్ర స్పీకర్ రాజీనామాలు తిరస్కరించినదే మహా భాగ్యం అనుకుని ఊరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ పెండింగ్‌లో పెడితే, సభకు వెళ్లివస్తూనే ఉన్నారు. రాజీనామాలు పరిష్కారం అని కాదు, తాము చేసిన పనులకే కట్టుబాటులేని తనం ఎందుకు? నిన్న ఆత్మహత్యలతో, నేడు ఆత్మహింసతో ఆకాంక్షలను ప్రకటిస్తున్న ప్రజల కాలిగోరుకైనా సరిపోలగలరా వీరు? తమతో కలవమని జనం చేస్తున్న విజ్ఞప్తికి వీరు ఇస్తున్న స్పందన ప్రభుత్వస్పందన కంటె ఏ రకంగా భిన్నమైనది? సమస్యకు పరిష్కారం కావాలి. నిజమే. అంతకంటె ముందు కనీసం స్పందన కావాలి.

35 comments:

 1. @శ్రీనివాస్ గారు:
  మీ విశ్లేషణ బాగుంది. నాదో సూటి ప్రశ్న సమాధానమిస్తారా?

  మీరు దొంగ అవునో కాదో అప్రస్తుతం. మీరు దొంగే అని ఒప్పుకోకుంటే నన్ను నేను హింసించుకునుటాను అని ప్రకటించి అలాగే చేస్తాను. మీరు అప్పుడు దొంగే అని ఒప్పుకుని నాకు ఆత్మసంతృప్తి కలిగిస్తారా?

  ReplyDelete
 2. మీరు నా వ్యాసంలోని మొదటి పేరా ని శ్రద్ధ గా చదివి ఉంటే, ఆ ప్రశ్న వేసి ఉండేవారు కాదు.
  ఒక అన్యాయమైన కోరిక కోరి, దాని కోసం ఆత్మహింసకు పాల్పడుతూ ఉంటే, ఆ కోరికను అంగీకరించాలా అని మీ ప్రశ్న.
  ఈ వ్యాసంతో నిమిత్తం లేకపోతె, విడిగా ఆ విషయం మీద నా అభిప్రాయం స్పష్టంగానే చెప్పగలను.
  కానీ, ఇక్కడ ఈ కాలమ్ కు మాత్రమే పరిమితమవుతాను.
  సమ్మె డిమాండ్స్ ని అంగీకరించాలని నేను అనలేదు. సమ్మె సరి అయినదో కాదో కూడా ఈ వ్యాసంలో కామెంట్ చేయలేదు. జనజీవితం స్తంభించి పోయి ఉంటే, ప్రభావం ఏమీ లేదు, చప్పగా ఉంది, విఫలం అయింది వంటి వ్యాఖ్యలు చేస్తున్నవారిని ఉద్దేశించి చేసిన రచన అది. సమ్మె తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, కానీ అబద్ధం మాత్రం కాదు. మిధ్య కాదు. కనిపిస్తున్న దాన్ని సత్యం అని అంగీకరించి, పరిష్కారం కోసం ప్రయత్నించాలి. ఏమీ జరగడం లేదనుకుంటే, చేయడానికి ఏమీ ఉండదు. ప్రస్తుత స్థితి కొనసాగుతుంది.
  ఆత్మా హింస ప్రస్తావన కాలమ్ లో మరోచోట కూడా ఉంది. సమ్మె చేస్తున్న వారికి సమ్మె బాధితులకు మధ్య వైరుధ్యం ఏమీ లేదని, ఇద్దరూ ఒకరేనని రాసాను. ఒక డిమాండ్ నెరవేర్చుకోవడానికి తమను తాము హింసించుకోవడానికి కూడా సిద్ధపడుతున్న ప్రజల ముందు , వారి ప్రతినిధులు ( అంటే తెలంగాణా ప్రజాప్రతినిధులు) హీనులు అన్న అర్థంలో రాశాను. ఈ సందర్భంలో కూడా మీ ప్రశ్నకు అర్థం లేదు.

  ReplyDelete
 3. శ్రీనివాస్ గారూ,
  నాకు తెలిసినంతవరకూ ఒక రచయిత ఏదైనా అంశమ్మీద స్పందిస్తున్నప్పుడు తన అభిప్రాయం చెప్పి ఆ అభిప్రాయానికి మద్దతుగా పాత్రల చిత్రణ (కథనం) లేదా విమర్శ చేస్తాడు. మరదేమో తెలుగునాడులో (ఆంధ్రలో అంటే అదో చిక్కు) పాత్రికేయులు, రచయితలు (అని చెప్పుకునేవారితో సహా) తమ అభిప్రాయం ఇదీ అని చెప్పకుండా కేంద్రమో కాకరకాయో ఏదో చెయ్యాలని తెగ ఆరాటపడిపోతుంటారు. అందుకే నేను సూటిగా మీ అభిప్రాయం అడిగాను.

  ఇక ఎన్నిసార్లు చదివినా ఉద్యమం మీకు ఆత్మహింసగానే అగుపడ్డది తప్పించి ఆ ఉద్యమము ముసుగులో జరుగుతున్న బలవంతపు రుద్దుడు అగుపడినట్లు లేదు. ఇదీ కారణమే మీ అభిప్రాయం అడగటానికి.

  ఏదేమైనా మీ స్పందనకు ధన్యవాదాలు.

  ReplyDelete
 4. సమ్మె సత్యం అని అంగీకరించి పరిష్కారం వెతకాలి.

  ఏ పరిష్కారం? ఇదివరకే మీరు చెప్పిన పరిష్కారం. అంతేనా? అందుకోసం కమిటీ వేసి నిజానిజాలు తేలిస్తే ఆ కమిషన్ ఒక కుట్ర అంటున్నారు.కడుపుకూటికై రాజధానికి వచ్చిన వాళ్ళతో సహా అందరినీ వలసవాదులనీ, ఇంకా లకారాలతో కవితాత్మకంగా బూతులు తిడుతున్నారాయె.

  విశాలాంధ్రలో ఎవడెట్లన్నా తగలడనీ మాకు మా తెలంగాణా కావాలె. సమస్య మీదే, పరిష్కారం మీదే, సమ్మె మీదే, త్యాగాలు మీవే.

  ReplyDelete
 5. /ఎందుకంటే, అక్కడ వాస్తవం చెప్పాలి./
  ఉద్యమం రాజకీయ స్వార్థం, ప్రాంతీయ ద్వేషమే పునాదులుగా నిర్మించబడ్డది, 'సఘీభావం' 'స్వాంతనవాక్యం' ఈవిషయంలో అర్థంలేని పదాలు. 1969తో పోలిస్తే అంత తీవ్రత, హింస లేదు, కాని విసృతి వుంది అన్నారు. వుంటే ఏంచేయాలి?!! తీవ్రత, హింస వుంటేనే అణచడానికి కారణాలు సులభంగా దొరుకుతాయి. ఇలాంటి చవట ఉద్యమాలు జరిగేకొద్దీ నష్టం స్పాన్సర్ చేస్తున్న వారికే.

  మరోమారు, ముక్కోడి ఫేమిలీ అందరితో నిజమైన దీచ్చ ఢిల్లేలో బలవంతంగానైనా చేయించండి. తలలు నరుక్కోవడానికి సిద్ధం కాని దీచ్చకు ఆరోగ్యం అడ్డొస్తోందటగా! సెగ ఇక్కడినుంచి చేస్తే ఢిల్లీ తాకదు, దూరం ఎక్కువైతే ఉష్ణనష్టం ఎక్కువవుతుందని తెలియదా? నిర్లిప్తత, ఉదాసీనత వుద్యమ కారణాలలో పసలేనందువల్ల జరుగుతోంది.

  :)) ఆ గజమాలేదో మీ ముక్కోడికి, జానారెడ్డి, గద్దర్, కోదండాలకు వేసి చావోరేవో తేల్చుకురమ్మని దీవించి ఢిల్లీ పంపండి, ఇచ్చుడో చచ్చుడో.

  ReplyDelete
 6. సమస్యకు పరిష్కారం గురించి చర్చించిన వ్యాసం కాదు ఇది. కనీసం స్పందన ఉండాలన్నాను. ఆందోళనలో ఉన్నవారితో ప్రభుత్వం ఒక చర్చ ప్రారంభించాలన్నాను. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు మొహం చాటేసి ఊరుకోవడం కంటే, సమస్యను చేతిలో తీసుకుని పరిష్కారాలు వెదకాలన్నాను. ఉద్యమకారులు అనుకున్న పరిష్కారం రావడం సంగతి పక్కకు పెట్టి, ప్రయత్నం అన్నది సంబంధిత ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలిగిస్తుంది. తెలంగాణలో పెద్ద ఉద్యమం ఏమీ లేదు, అంటా సజావుగా ఉంది అని మభ్యపెడితే, రేపు అనూహ్య పరిణామాలు జరిగినప్పుడు, బాధ్యత ఎవరు తీసుకోవాలి? వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకోవడం సీమాంధ్రుల హక్కు కూడా. వారికి అబద్ధాలు ఫీడ్ చేస్తే, ఫలితానికి వారు సన్నద్ధంగా ఉండడం సాధ్యమా?
  తెలంగాణ సమస్య విషయంలో నా అభిప్రాయం ఏమిటో గతంలో ( రేపు భవిష్యత్తులో) చేసే రచనల్లో స్పష్టంగానే చెప్పాను, చెబుతాను. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం న్యాయమైన డిమాండ్. రాష్ట్ర విభజన జరగడమే న్యాయం. యెంత న్యాయం అంటే, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంద్ర రాష్ట్రం ఏర్పడినంత న్యాయం. ఏ ఉద్యమం లో అయినా కొంత అతి ఉంటుంది. తమిళుల విషయంలో అప్పట్లో ఆంద్ర ఉద్యమ నాయకులు ఏమంత మర్యాదగా లేరు. ఆంద్ర రాష్ట్రం ఏర్పాటు గురించి అనుమానాలు ప్రకటించిన నాటి రాయల సీమ నేతలు, కోస్తాంధ్రుల విషయంలో అంత మృదువుగా ఏమీ విమర్శించలేదు.
  తెలంగాణా ఉద్యమం తీరు తెన్నుల గురించి క్షేత్ర స్థాయి కి వెళ్లి ఎవరైనా తటస్థ పరిశీలన చేస్తే, అది రుద్దుడు ఉద్యమమో, నిజంగా జనంలో ఆకాంక్ష బలంగా ఉన్నదో తెలుస్తుంది. తెలంగాణా ఉద్యమం గురించి చప్పరించేస్తున్న చాలామంది, కంచికచెర్ల లో నిద్రపోయి వనస్థలిపురంలో నిద్రలేచేవారే. మధ్యలో ఉన్న తెలంగాణా ఏమిటో వారికి తెలియదు.

  ReplyDelete
 7. |వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకోవడం సీమాంధ్రుల హక్కు కూడా|
  అవునవును వాస్తవ పరిస్థితి తెలుసుకోవటం సీమాంధ్రుల హక్కే. నిజానికి సీమాంధ్రుల హక్కే కాదు యావత్ తెలుగువారి హక్కు. దాన్ని ఎలా తొక్కేయాలో తెలంగాణవాదులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదులెండి.

  |ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం న్యాయమైన డిమాండ్. రాష్ట్ర విభజన జరగడమే న్యాయం|
  డిమాండు ఎలా న్యాయనద్ధమో అది న్యాయబద్ధమైనదే అని చెబుతున్నవారు వివరించాలి కదా మరి. ఆ ఒక్కటీ తప్ప మరేదయినా అడగమంటారు తెలంగాణవాదులు!

  ReplyDelete
 8. /ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం న్యాయమైన డిమాండ్. రాష్ట్ర విభజన జరగడమే న్యాయం. యెంత న్యాయం అంటే../ :D

  మీరు చెప్పింది 'న్యాయం' అంటున్నారు. ఎవరికి వారిది న్య్యాయం కాక మాది అన్యాయవుద్యమం, అందరూ ఏకగ్రీవంగా మద్దతివ్వండి అని అడుగలేరు కదా? సాధారణంగా ఇలాంటి ఉద్యమాల్లో ఉద్యమకారులు కూడబల్కుకుని అతివాద, మితవాద, మధ్యేవాద గ్రూపులుగా విడిపోయి మాట్లాడుతూ వుంటారు. మితవాద పాత్రధారులు అతివాదులు చేసింది తప్పే, వాళ్ళు రాజకీయనాయకులు వాళ్ళను పట్టించుకోనవసరం లేదు, కడుపుమండినోళ్ళు నాలుగు దెబ్బలేస్తారు కాని 'న్యాయం' వుందాలేదా అని మీరు దెబ్బలు సహిస్తూ, వెంటనే మేము అడిగింది మారుమాటాడక ఇచ్చేయడమే మీకు 'న్యాయం' అని అటూ ఇటూ ఓ పథకం ప్రకారం వత్తిడి తెస్తూవుంటారన్న విషయం మనకు తెలిసిందే. :)

  న్యాయాల్లో అనేకరకాల న్యాయాలుంటాయని మీలాంటి మేధావివర్గానికి తెలియంది కాదు. - జంతున్యాయం, ఆటవికన్యాయం, భ్రమర-కీటక న్యాయం, సామాజిక న్యాయం, శోషలిస్టున్యాయం, కమ్యూనిస్టు న్యాయం, కోదండ తీవ్ర-అహింసా న్యాయము, ముక్కోడి బూతులు-దీక్షలు న్యాయం, కెటిఆర్ విగ్రహకూలగొట్టుడు న్యాయం, సింగిడి-బూతుకవితా న్యాయం, హరీష్ రావు గారి 'తన్నేరు న్యాయం' ... ఇత్యాదులు. 'న్యాయం' ఏదో తేల్చాల్సింది మధ్యవర్తులు, మనకు మనమే నాయం అనిచెప్పేసుకుంటే కోర్టులెందుకు? ఒట్టి దండగ, ఏమంటారు? మధ్యవర్తులు, ఇతర రాష్ట్రాలకు చెందిన 'దిక్కుమాలిన కమిటీ' సభ్యులు 50ఏళ్ళ డాటా పరిశీలించి చెప్పింది న్యాయం కాదని మీరు ఎలా చెప్పగలరు?

  ఇగ పోతే ... 'న్యాయం' కావాలంటే ఓపిక అవసరం, కోర్టుల్లో సాధారణ విషయాలు ఎంత టైమ్ తీసుకుంటాయో మీకు తెలియంది కాదు. 'మాగ్గావాలె, గిప్పుడే కావాలె! ఏదో ఒకటి చెప్పున్రి' అని మీరు బలవంతపెడితే ... నాకు తెలిసి ఓ instantన్యాయం 'పోలీసు న్యాయమే'. అదే పరిష్కారం అని నా ఉద్దేశ్యం కూడా.

  నోటి దురద తీర్చుకునే అతివాదుల వారింపక, ఇప్పుడు మితవాదులు మధ్యలో కల్పించుకుని "ధర్మము, ధర్మమనుచు వితండ వితర్కములాడనేలా... ఆ.."(కృష్ణరాయబార పద్యం, సింగిడి-బూతు పద్యం కాదని ప్రార్థన:D)

  ReplyDelete
 9. నాకు తెలిసి రెండో విడత తెలంగాణా ఉద్యమం 1996 నుంచి మొదలైంది. 1997 లో భువనగిరి లో జరిగిన పెద్ద సభ (తెలంగాణ జనసభ) మొదటి ప్రజాప్రదర్శన. అప్పటినుంచి ఇప్పటి దాకా ఒక మిలియన్ పేజీల సమాచారమో, అభిప్రాయాలో, సాహిత్యమో వెలువడి ఉంటుంది. తెలంగాణా ఎందుకు న్యాయబద్ధమో ఆ లిటరేచర్ చదివితే తెలుస్తుంది. అలాగే రాష్ట్రం కలిసిఉంటేనే న్యాయమని చెప్పేవారి సాహిత్యం కూడా కొంత వచ్చింది. అది చదివితే, తెలంగాణా డిమాండ్ యెంత అన్యాయమో తెలుస్తుంది. చివరగా, తేల్చుకోవలసింది ఎవరికి వారే. వారి వారి అనుభవాన్ని బట్టి, వివేచనను బట్టి తేల్చుకోవాలి. కొత్తగా ఇప్పుడు ఏది అన్యాయమో ఏది న్యాయమో చెప్పనక్కర లేదు. 2009 డిసెంబర్ దాకా నిద్రపోయి, హఠాత్తుగా మెలకువ వచ్చిన వారు, 2004 కాంగ్రెస్ తెరాస తో పొత్తు పెట్టుకున్నా, 2009 లోనూ అదే మాట చెప్పినా, మధ్యలో తెలుగుదేశం తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా - ఏమీ కానట్టు ఊరుకుని, తీరా కేంద్రం ప్రకటన వచ్చేసరికి, అదేదో ఉన్నట్టుండి జరిగిన పరిణామమని ఆర్తనాదాలు చేసారు. 2001 నుంచే, కనీసం 2004 నుంచే ఎందుకు ఈ సమైక్యాంధ్ర వాదులు తమ వ్యతిరేకతను చెప్పలేదు? కోర్టుల్లో న్యాయం జరగడానికి 15 సంవత్సరాలు చాలవా?

  ఒకసారి 1969 ఉద్యమం నాటి సంఘటనలను తెలిసిన వారి నుంచి తెలుసుకోండి. అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా తెలుస్తుంది. రకరకాల రాజకీయాల వాళ్ళు ఉన్నప్పుడు కొందరు అతిగా కొందరు మెతగ్గా మాట్లాడతారు. ఒక్కోసారి, ఏమీ లేనమ్మనే ఎగిరెగిరి పడుతుంది. నిష్క్రియాపరులే ప్రగల్భాలు పలుకుతారు. ఇటువైపు కేసీఆర్ అయినా, అటువైపు లగడపాటి టీజీ వెంకటేష్ అయినా ఉత్తరకుమార వచనాలు చాలా పలికారు. ఉద్యమాలలో పాలూ నీళ్ళను వేరుచేసి, జరగవలసినంత న్యాయం కోసం రెండు వైపులా విజ్ఞులు ప్రయత్నించాలి. అంతే కాని, తాము యెవరిని తప్పు పడుతున్నారో, వాళ్ళ సంస్కార స్థాయిలోనే దూషణలకు దిగడం, అసభ్యంగా మాట్లాడడం తగని పని. విషయాన్ని నిష్పక్షపాతంగా చూసేవారు,ద్వేషభాషనువిడనాడాలి.

  ReplyDelete
 10. Annaji Sekhar Gubbala says:-
  శ్రీనివాస్ గారు మీరు చెప్పిందంతా మేము రోజూ వింటున్నదే. మీలెక్కలే తీసుకొంటే మొత్తం మీరుచెప్పిన సమూహాలన్నీ కలిపినా ఇరవై లక్షలు మించలేదు. అంటే నాలుగుకోట్లలో ఇదు శాతం. అవును కదా? అంటే ఇదుశాతం మంది ప్రజలు సమ్మె చేస్తుంటే జాతీయ మీడియా ఇది సూపర్ హిట్ అని ప్రతీ పదినిమిశాలకోసారి స్క్రోలింగ్ వెయ్యాలి. సెంట్రల్ హోం మినిస్టర్ నుండి అంతా మీ కెసిఆర్ కాళ్ళదగ్గర హాజరుకావాలి అంతేనా? ఒకసారి ఇలాగె కే కే, జానాలు ఢిల్లీలో అబద్దాలు చెప్పి తెలంగాణా మీద ఒక ప్రకటన ఇప్పించారు. అపుడు జరిగిన తప్పు ఇంకా సరికాలేదు.

  ఇంక ఉద్యమం గురించి చెప్పారు. నాది ఒక సూటి ప్రశ్న ఎనిమిదిసంవత్సరాలు విషపు ప్రచారంతో పెరిగి సాగుతున్న విధ్వంసకర,వేర్పాటువాద, అసూయతోనిండిన ఉద్యమం సహజమైనదా? లేక పన్నెండుగంటలలో స్వచ్చందంగా ప్రజలనుండి పుట్టిన శాంతియుతంగా సాగిన ఉద్యమం సహజమైనదా? ఉత్తరాకుమారులు అన్నారు ....ప్రగల్బాలు పలకని ఒక్క తెలంగాణా నాయకుని,నాయకుని పుత్రా,పుత్రికా రత్నాలను చూపండి. తెలంగాణాకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తారా? ఎంతమందిని నరుకుతారు? ప్రతి రోజూ ఒక్కచోటైనా ఈ బ్యానర్ పట్టుకొనే కొంతమంది ఉద్యమకారులు జనాలను బెదిరిస్తూ ఉంటారు. మీరు చెప్పేలెక్క నాలుగుకోట్లు అందులో యభైలక్షలకు పైగా సమైఖ్యాన్ధ్రకు మద్దత్తు పలుకుతారు. మరి సీమంధ్ర ప్రజలు ఎటులేదన్నా ఆరుకోట్లు ఉంటారు మీకు మద్దతుపలికేవారు ఒక యభైలక్సలు ఉన్నా వాళ్ళు ఇక్కడికి రారు. మరి ఎంతమంది ఎంతమందిని నరుకుతారో చెప్పాలి.

  రెండువేల తోమ్మిదివరకూ సమైఖ్యవాదం వీదులకెక్కపోవడానికి కారణం ఈప్రభుత్వంమీద వ్యవస్తమీద సమైఖ్యవాదులకు ఉన్న నమ్మకం. నిజంగానే రెండో ఎస్సార్సీవేసి అది సశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విడగొట్టమని సూచించి ఉంటే....సమైఖ్యవాడులకు నుండి ఇంత వ్యతిరేకత ఉండేది కాదు. కానీ ఒక వేర్పాటువాది, హింసావాది,నోటిడురద మనిషి చేసే ఒక కుహనా నిరాహరదీక్ష తో ఒక రాష్ట్రాన్ని విభజిస్తే అదీ ఏవిధమైన సమాలోచనలు, ఒప్పందాలు లేకుండా! ప్రజలు ఎలా ఒప్పుకొంటారు?
  forwarded by rakthacharithra

  ReplyDelete
 11. ఇటీవల మన ముందుకొస్తున్న అనేక సామాజిక చలనాలు, ఉద్యమాలు, మనకున్న ప్రజాస్వామిక దృక్పథం అసలు ఏపాటిది అన్న సంగతిని పట్టి పట్టి ముందుకు తెచ్చేవిగానే ఉంటున్నాయి. అనేక సందర్భాలలో అనేక మినహాయింపులను ముందుంచుకుంటూ వీటిని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. తెలంగాణా ఉద్యమం కూడా అటువంటిదే.
  ఒకవైపు ఉవ్వెత్తున పోరాటం సాగుతూ ఉంటే కోస్తా జిల్లాల్లో మధ్యతరగతి తమ జేబులో సొమ్ము అవతలి వాడికి అన్యాయంగా ధారపోయాల్సివచ్చినట్టుగా బాధ పడుతున్నారు. బలమైన ప్రభుత్వాలుంటే ఇలా జరగక పోను అని ఆక్రోశిస్తున్నారు. అన్యాపదేశంగా హింసను కోరుకుంటున్నారు. పిల్లలకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పాల్సిన పంతుళ్ళూ ఇందులో జతవుతున్నారు.
  దీన్ని తెలంగాణా ఉద్యమానికి బయటి ప్రజానీకపు ప్రతిస్పందన అనుకోవచ్చు. ఈ ఉద్యమాన్ని రాజకీయాల ఎత్తుగడల్లో భాగమని, దానికి జనాన్ని, జనం పేరునూ వాడుకుంటున్నారనీ కూడా ఇక్కడ వాళ్ళూ అనుకుంటున్నారు. ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే శ్రీనివాస్ తెలాంగాణా ఉద్యమాన్ని ఒక వాస్తవం అని రాసారు. కానీ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికైనా ఒక దృక్పథం అవసరం అని చెప్పడానికి ఇదంతా రాస్తున్నాను.
  మనం చెప్పుకునే ప్రజాస్వామ్యం లాంటి పెద్ద మాటలు సందర్భానికి ఎలా అతకవో చెప్పడానికి ఇదొక సందర్భం. దీనికి ఎవరు బాధ్యులు???????????

  ReplyDelete
 12. రక్త చరిత్ర గారు,
  మీరు మంచి వాదనలే చేసారు. ఉద్యమాల్లో ప్రజలు యెంత శాతం పాల్గొంటారని మీరు భావిస్తున్నారు? ఏ దేశంలో అయినా, ఏ ఉద్యమంలో అయినా? పోనీ రష్యా విప్లవంలో యెంత శాతం పాల్గొని ఉంటారు? అతి పెద్ద ప్రజా ఉద్యమమని అనుకునే వాటిలో కూడా ఎక్కడా పది శాతం మించరు. ఈ పదిశాతం మందికి సహకరించే వారు, మౌనంగా సానుభూతి చెప్పేవారు, తటస్థంగా ఉండేవారు తక్కిన జనాభాలో ఉంటారు. జాతీయోద్యమంలో యెంత మంది ప్రజలు పాల్గొన్నారో ఒక సారి తెలుసుకోండి.
  జాతీయ మీడియా గురించి యెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పాలగుమ్మి సాయినాథ్ గారు ఒక సారి రాశారు. మన దేశంలో ఫ్యాషన్ ఈవెంట్స్ కి యెంత మంది విలేఖరులు వస్తారో, ఆకలి చావుల కలహండికి యెంత మంది వెళ్ళారో ఆయన ఒకసారి లెక్క ఇచ్చారు. జన సంఖ్య బట్టి వాళ్ళు హాజరు కారు. వాళ్ళ ఆసక్తులు వేరు. ఢిల్లీ లో జరిగితే వాళ్లకు పెద్ద ఈవెంట్. వరదలొచ్చి వేలమంది చనిపోయినా కన్ను తెరవని టీవీ కెమెరా, ముంబై వరదలకు గుండెలు బాదుకుంటుంది. ఈజిప్ట్ లో జరిగితే, లిబియా లో జరిగితే అట్టహాసంగా కవర్ చేసిన వారు, మన దేశంలో మన కళ్ళ ముందే జరిగితే ఎందుకు పట్టించుకోరు? మీరు అన్నట్టు తెలంగాణా ఉద్యమం పనికిమాలిన ఉద్యమమే అనుకుందాం, అయినా ఆ తీర్పు చెప్పవలసింది మీడియా కాదు కదా, ఆ తీర్పు ప్రకారం మీడియా కవరేజ్ ఇవ్వడం మానేస్తే అది వృత్తి ధర్మం అవుతుందా? ఇంత జనం పాల్గొన్న ఉద్యమానికి గతంలో వాళ్ళు ఇంతే కవేరేజి ఇచ్చారా? మీరే ఆలోచించండి.
  సమైక్య వాద ఉద్యమాన్ని, తెలంగాణా ఉద్యమాన్ని మీరు పోల్చారు. సమైక్య ఉద్యమాన్ని తక్కువ చేసి చూడవలసిన అవసరంలేదు. ఏ ఉద్యమం లో అయినా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నప్పుడు, ఆ ఉద్యమం మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా, ముందు దాన్ని పట్టించుకోవాలి. అలాగే సమైక్య ఉద్యమాన్ని కూడా పట్టించుకోవాల్సిందే. పట్టించుకున్నారు కాబట్టే, కేంద్రం పాత ప్రకటనను మార్చుకున్నది. అట్లా మార్చుకోవడమే ఏకైక మార్గం కాదు. కానీ అది కేంద్రం స్పందన. దాన్ని అర్థం చేసుకోవాలి. మరి, ఇవ్వాళ గత 20 రోజులుగా జరుగుతున్నా దాన్ని పట్టించుకోనక్కర లేదా? అదీ నేను నా వ్యాసంలో ప్రశ్నించింది.

  ReplyDelete
 13. ఇక రక్త చరిత్ర గారూ, తెలంగాణా ఉద్యమం మీద మీకున్న అభిప్రాయాలు చాలా అన్యాయంగా ఉన్నాయి. తెలంగాణా ఉద్యమాన్ని కే సి ఆర్ నీ పర్యాయ పదాలు చేసి మాట్లాడ్డం ఒక అన్యాయం. కె సీ ఆర్ ని అయినా అట్లా అనడం మరో అన్యాయం. ఉద్యమాలు ఎందుకు పుడతాయి, వాటికి నాయకులు యెట్లా రూపొందుతారు వంటి విషయాలను చరిత్ర చదివి మనం తెలుసుకోవచ్చు. ఉద్యమాలను నాయకులు తయారు చేయరు! సమస్య సమాజంలో ఉంటుంది. దాన్ని ఆసరా చేసుకుని ఉద్యమాలు ఏర్పడతాయి. వాటిని నిర్వహించేవారి చైతన్యం సంస్కారం బట్టి అవి వేర్వేరు రూపాలు తీసుకుంటాయి. రాష్ట్రాల ఫెడరల్ హక్కుల కోసం, నదీజలాల పంపకం కోసం, చండీఘడ్ బదలాయింపు కోసం పంజాబ్ ఉద్యమం మొదలైంది. అది తీవ్రవాదంగా పరిణమించింది. అయినంత మాత్రాన, నేపథ్యం గా ఉన్న కారణాలను నిరాకరించ గలమా ? చంద్ర శేఖర రావు దుర్మార్గుడనే అనుకుందాం, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యమం కూడా దుర్మార్గమైనది అవుతుందా? తెలంగాణా ప్రజల మీద, నాయకుల మీద ఇంతటి వ్యతిరేక అభిప్రాయం కలిగిఉన్నవారు, వారితో కలిసి సహజీవనం చేయాలని ఎందుకు తహతహ లాడుతున్నారు? వేర్పాటువాదుల భాష అంటే ద్వేషంతో ఉంటుంది అనుకుందాం, మరి సమైక్య వాదుల భాష యెంత సామరస్యంగా ఉంటోంది?
  కారంచేడు, పదిరికుప్పం, చుండూరు, నీరుకొండ, కంచికచెర్ల- వంటి సుప్రసిద్ధ సంఘటనలు తమ ప్రాంతంలో పెట్టుకుని, తెలంగాణలో దళితులకు దొరలనుంచి ప్రమాదం ఉన్నదని ప్రచారం చేయడం, దేశాన్ని, ప్రపంచాన్నీ కూడా దోచుకోగలిగిన ఘరానా సంపన్నులు అసంఖ్యాకంగా ఉన్న ప్రాంతం వారు కె సీ ఆర్ వంటి వారిని దొరలూ అని నిందించడం- ఏ రకంగా సమర్థనీయం? కోస్తాంధ్ర ఘరానా సంపన్నుల ఆస్తితో (వారికి తెలంగాణా లో ఉన్న ఆస్తులు మాత్రమే తీసుకున్నా) పోలిస్తే మీరు ఇంతగా ఆడిపోసుకుంటున్న కె సీ ఆర్ కుటుంబం 'వసూళ్ళ' ద్వారా సంపాదించిన ఆస్తి ఏ మాత్రం? ఆవగింజంత అని నేనంటాను. మీకు అంతకు మించిన ఆధారాలుంటే, చెప్పండి.
  తెలంగాణా ఉద్యమం 1996 నుంచి మొదలైంది. అంతకు ముందు 1969 లో ఒకసారి, 1953 -55 మధ్య ఒకసారి కుడా ఉద్యమా లొచ్చాయి. అన్నట్టు ఆంద్ర ప్రాంతంలో కూడా 1972 -73 లో కూడా ఒక ప్రత్యేక ఉద్యమం వచ్చింది. ఇప్పుడు సమైక్య వాదులుగా ఉన్న మహామహులు అప్పుడు ప్రత్యేక వాదులు. అప్పటికి వారికి హైదరాబాద్ లో ఆర్ధిక ప్రయోజనాలు లేవు కాబట్టి, ప్రత్యేకంగా ఉంటామన్నారు. ఇప్పుడు సంగతి వేరు కాబట్టి, కలిసి ఉందామని అంటున్నారు. సరే, ఈ 'జబ్బు' అక్కడ కూడా ఉండింది అని చెప్పడానికి ఆంద్ర ఉద్యమం మాట. అప్పుడు వారు కూడా దీక్షలూ వగైరాలు చేసారనుకుంటాను.
  2009 దాకా సమైక్య వాదులకు వ్యవస్థ మీద నమ్మకం ఉండిందని, అది డిసెంబర్ 9 పోయిందని, అందుకే అంత ఆలస్యంగా స్పందించారని అంటున్నారు. ఏమిటా నమ్మకం? తెలంగాణా వాళ్ళ మాట ఎవరు వింటారు లెమ్మన్న నమ్మకమా? తెలుగుదేశం పార్టీ తన అధికారిక వైఖరి చెప్పిన తరువాత కూడా, ఆ పార్టీని సహించారు కదా, అంటే, ఆ పార్టీ తెలంగాణా వాళ్ళను మోసం చేస్తుంది లెమ్మన్న నమ్మకమా? కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో పరోక్షంగా ప్రస్తావించినా, కమిటీలతో మభ్యపెడుతున్నా- చివరికి ఆ పార్టీ తెలంగాణా వాళ్ళను మోసగిస్తుందన్న నమ్మకమా? ఏమిటా నమ్మకం? తెలుగుదేశం పార్టీ విధానాన్ని రూపొందించిన కమిటీలో ఉన్న ఎర్రంనాయుడుకు ఆ నాడు ఏమి నమ్మకం ఉండి, అనుకూల ప్రకటన చేసాడు? వై ఎస్ ఆర్ తో పాద యాత్రలో నడచిన రాజగోపాల్ కి 2004 లో పార్టీ విధానం ఎందుకు అభ్యంతరం అనిపించలేదు. ఎలాగూ కాదులే అన్న నమ్మకమా?

  1996 లో ఉద్యమం మొదలైతే, 2001 దాకా కే సీ ఆర్ అందులోకి రానే లేదు. కేసీఆర్ కాక ఇంకా అనేక సంఘాలూ బృందాలూ ఉద్యమంలో ఉన్నాయి. జాతీయ పార్టీలయిన సిపిఐ బీజేపీ ఉన్నాయి. ఉద్యమం లో కేసీఆర్ ని గట్టిగా వ్యతిరేకించే శక్తులూ ఉన్నాయి. ఉద్యమం ఒకరి చేతిలో లేదు. నిరాహార దీక్షలు చేస్తే రాష్ట్రాలు ఇచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి. నరేంద్ర మోడి సద్భావనకు దీక్ష చేయగా లేనిది, కేసీఆర్ చేస్తే తప్పేమిటి?

  అడ్డంగా నరికేస్తామని, కాళ్ళు తీసేస్తామని, నాలుక కోసేస్తామని- మాట్లాడే వాళ్ళు అటూ ఇటూ ఉన్నారు. సభ్యతను పాటించవలసిన నేతలు అటువంటివి మాట్లాడకూడదు. కానీ ఏం చేస్తాం? ఒక్క తెలంగాణా విషయంలో నే కాదు అన్నిరకాల రాజకీయ సమరాల్లోనూ నేతల సంస్కారం అట్లానే ఉంటోంది. అయితే, అవి మాటలే తప్ప వాటికి ఎటువంటి ప్రాధాన్యం లేదు. ఎవరూ ఎవరినీ కోసిండీ లేదు, తీసిందీ లేదు. బహుశా, ఆచరణలో ఉన్న మిత వాదాన్ని కవర్ చేసుకోవడానికి వాగాడంబరం మీద ఆధార పడతారనుకుంటాను. వాటిని బట్టి ఉద్యమాలను అంచనా వేస్తారా? రాజశేఖర రెడ్డి నంద్యాల లో మాట్లాడిన మాటలు,చంద్ర బాబు చెప్పే రెండు కళ్ళ సిద్ధాంతం కంటే పై మాటలు హింసాత్మకాలా?

  ReplyDelete
 14. సర్లెండి విషయం బాగానే అర్థం అయ్యింది మీ వ్యాఖ్యలను బట్టి దోచుకోవటానికి అవకాశంకోసమే ఉద్యమమని మొత్తమ్మీద! మెన్ననే చూశాం తెలంగాణ తెలంగాణ అని తెగ చించుకునే ఓ మంత్రి భాగోతం. అవకాశం వస్తే అదే కోట్లకు పెరుగుతుంది. కులం అనేది కేవలం ఆంధ్రలోనే అగుపడుద్ది తెలంగాణవాదులకు అక్కడికి తెలంగాణ గడీలన్నీ పుణ్యక్షేత్రాలయినట్లు! ఎదుటివారిపై రాళ్ళేసేముందు మన చరిత్ర చూసుకోవాలి.
  అసలు జాతీయ మీడియా కూరలో కరివేపాకైతే మరి వాటి ఆఫీసులమీద దాడులెందుకో! అయినా తెలంగాణవాదుల ప్రజాస్వామ్యయుత ఉద్యమం గురించి లోకమెరుగనిదా ఏమి అంతా నా ప్రయాస!

  ReplyDelete
 15. అది అన్యాయం, ఇది న్యాయం అని మీరు ఓ వైపు న్యాయనిర్ణయం చేస్తూనే ఈ యదవ ఉద్యమం చేసిన ముట్టడి, దౌర్జన్య్మ, దుశ్చర్యలు కవరేజ్ చేయకపోవడం న్యాయమేనా అని ప్రశ్నిస్తున్నారు. మీరేమైనా హైకోర్‌ట్లో నక్కిన సుమోటో-న్యాయాధీశుడు కాదు కదా?! :))
  సినిమావాళ్ళ దగ్గర వసూళ్ళు చేయడం న్యాయమేనా? ఆ పైసల్ కొన్ని మీడియా వాళ్ళకు పోసి కవరేజి ఇప్పించుకోక, ఫ్రీగా కవరేజి పొందాలని కోరడం న్యాయమేనా? ధర్మమేనా? 1996లో మొదలు చేశారా? మరి 53ఏళ్ళూగా పోరాడుతున్నం అన్నారు?!! ఇలా కాకిలెక్కలు చెప్పడం, మరచిపోయి 1996 అనడం ధర్మమేనా? 600మంది త్యాగాలు చేసిన్రు అన్నారు, ఆ సంఖ్య 2ఏళ్ళనుంచి అప్డేట్ కాలేదు - ఇది న్యాయమేనా? కనీసం 605కు పెంచున్రి.

  ReplyDelete
 16. /చంద్ర బాబు చెప్పే రెండు కళ్ళ సిద్ధాంతం కంటే పై మాటలు హింసాత్మకాలా?/
  ఇందులో హింసాత్మకం ఏమిటో చెప్పండి, తెలుసుకుంటాం. రెండు ప్రాంతాలు నా కళ్ళవంటివి అంటే బూతులా మీకు వినిపించిందా?! అది కాంగ్రెస్ కాటుకు చంద్రబాబు చెప్పుదెబ్బ కొట్టాడనిపించింది. మీరెందుకు పరేషాన్ అవుతున్రు?!

  ReplyDelete
 17. రెండు ప్రాంతాలలో సమాన బలాలు ఉన్నాయి, రెండు ప్రాంతాలు మాకు ముఖ్యమే, ఆయా ప్రాంత వాళ్ల అభిప్రాయాలు గౌరవించటం మాకు తప్పదు, ఉప ప్రాంతీయ పార్టీల లాగా, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమయిన వాళ్లము కాదు, అంతకంటే, కచరాను ముందు పెట్టి, కాంగీ ఆడే ఆటకు అంతకంటే ఇంకేమి చెప్పలేము అనే కాంగీ కి ప్రధాన ప్రతిపక్షమయిన పార్టీ రాష్ట్రం లో చెప్పటం లో మీకేమి తప్పు కనిపించింది మహాశయా? TDP ఎక్కడయినా తెలంగాణా కు వ్యతిరేకమని ప్రకటన ఇచ్చిందా? లేక హైదరాబాదు ను గుత్తగా కచరా దొరకు, ఆయన కుటుంబానికి వ్రాసిస్తానని మాట తప్పాడా?

  అయినా తెలంగాణా దేవత (కచరా దొర ప్రకారం) కరుణించకపోతే, ఆ ఏడుపు ఏదో ఆ దేవత పాదాల దగ్గర ఏడవక, ఇంకెవరి మీదో ఎందుకు? ఇచ్చేది కాంగీ, తెచ్చేది మేము అన్న డవిలాగులు మరచేపోయారా? అంతెందుకు, NTR విగ్రహాలు మీద దాడులు చేస్తారు కాని, ఏ రాజీవో, ఇందిర విగ్రహాల మీదో దాడి ఎందుకు చేయరు?

  హేమిటి, ఉద్యమం ఒక్కరి చేతిలో లేదా, గులాబి కండువా లేకుండా జై తెలంగాణా అంటున్న నాయకుల పరిస్థితి చూసే అంటున్నారా ఆ మాట?

  వసూళ్ళు ఎంత చేస్తే కోస్తా, సీమ వాళ్లతో మీ దొర సమానుడు అవుతాడో, కాస్త చెబితే, ఆ వసూళ్ళ కార్యక్రమం, ఆ లెక్కలు ఎదో చూసుకోవచ్చు కదా!! అందరం కవితక్క ఆద్వర్యంలో, మీ మీడియా వాళ్ల సాక్షి గా :)

  కాని, మీ దొర వసూళ్ల గురించి ఒప్పుకొన్నందుకు మాత్రం, ఆ దొర బాంచెన్ అయిన మీకు నా జోహార్లు, జై వసూళ్ల తెలంగాణా :)

  ReplyDelete
 18. "ఒక్క తెలంగాణా విషయంలో నే కాదు అన్నిరకాల రాజకీయ సమరాల్లోనూ నేతల సంస్కారం అట్లానే ఉంటోంది." - ’నేతల’ మాటతో రాజకీయ నాయకులను మాత్రమే ఉద్దేశించారో ఇతర నేతలనూ కలిపారో తెలీలేదు. ఈ ఉద్యమంలో పద్ధతిగా మాట్టాడేవాళ్ళ పేర్లు ఇప్పటికిప్పుడు నాకైతే ఒక్కటీ గుర్తుకు రావడం లేదు. తె.రాజకీయ నాయకులు, తె.సామాజిక నాయకులు/విశ్లేషకులు, తె.విద్యార్థి నాయకులు, తె.ఉద్యోగుల నాయకులు, తె.కవులు, తె.కళాకారులు, తె.జాకువీరులు, తె.వాళ్ళు, తె.వీళ్ళు - దాదాపుగా అందరూ కూడా దురుసుగా మాట్టాడినవాళ్ళే. ఎవడు ఎక్కువ తిడితే వాడు పెద్ద నాయకుడు అనే పోటీలాంటిది పెట్టుకుని రెచ్చిపోతున్నారు. అశుద్ధం చిమ్మిన ఆ నోటితోటే అన్నదమ్ముల్లాగా విడిపోదామంటూ మాట్టాడి నోరు కడుక్కోవాలని చూస్తారు.

  "వాటిని బట్టి ఉద్యమాలను అంచనా వేస్తారా?" - నాయకుడి ప్రవర్తనను బట్టి కూడా ఉద్యమాన్ని అంచనా వేస్తారు. సంపాదకుణ్ణి బట్టి, యజమానిని బట్టీ పత్రికను అంచనా కట్టమూ?

  "రాజశేఖర రెడ్డి నంద్యాల లో మాట్లాడిన మాటలు,చంద్ర బాబు చెప్పే రెండు కళ్ళ సిద్ధాంతం కంటే పై మాటలు హింసాత్మకాలా?" - వాళ్ళు చెప్పిన మాటలు హింసే అయితే, అదే కొలతన గత రెండేళ్ళుగా తెవాద నాయకులు కోస్తా సీమల ప్రజలపై చేస్తున్నదాన్ని ఊచకోత అనాలి, నరమేథం అనాలి.

  "వేర్పాటువాదుల భాష అంటే ద్వేషంతో ఉంటుంది అనుకుందాం, మరి సమైక్య వాదుల భాష యెంత సామరస్యంగా ఉంటోంది?" -
  1. వేర్పాటువాదుల భాష ద్వేషంతో ఉంటుందని ఎందుకనుకోవాలి? పద్ధతిగా ఎందుకు మాట్టాడరు?
  2. వేర్పాటువాదులు బూతుకూతలు కూస్తూంటే సమైక్యవాదుల భాష సామరస్యంగా ఎందుకుండాలి?
  3. వేర్పాటువాదులది దాడి. అవతలోళ్ళది ప్రతిస్పందన -అది కూడా అతి తక్కువ మోతాదులో.

  ReplyDelete
 19. గతంలో ఎపుడూ నేను కామెంట్స్ కి ఇంత తరచుగా స్పందించలేదు. అన్ని రకాల అభిప్రాయాలు తెలుస్తాయి కదా అని ఈ సారి ఉత్సాహ పడ్డాను. చర్చను, ఒక స్థాయిలో, ఉద్వేగాలది పైచేయి కాకుండా జరిపితే నిజంగానే ఉపయోగం ఉంటుంది. కానీ, తరచూ విషయం మీద చర్చ కాకుండా, వ్యక్తుల మీద జరిగితే అది వాగ్వాదం అవుతుంది తప్ప చర్చ కాదు. ఎవరితోనూ తగవు పెట్టుకునే ఉద్దేశ్యంతో నేను ఈ రచనలు చేయలేదు. నా అభిప్రాయాన్ని, విశ్లేషణను పంచుకోవడం, వచ్చిన స్పందనలనుంచి నేర్చుకోవడం మాత్రమే నా ఉద్దేశ్యం.
  పైన జరిగిన చర్చలో ఒకటి రెండు అంశాలు- నా అవగాహన చెప్పాలని అనుకున్నవి- ఉన్నాయి. వాటిని మాత్రం ప్రస్తావించి ఈ చర్చను ముగిస్తాను. ఒకటి చంద్రబాబు నాయుడు గారి రెండు కళ్ళ సిద్ధాంతం గురించి. అందరు రాజకీయ నాయకుల మీద ఉన్నట్టే చంద్రబాబు మీద కూడా నాకు కొన్ని అంచనాలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన మీద వ్యక్తిగతంగా ఎటువంటి అభిప్రాయమూ లేదు, అగౌరవం అసలే లేదు. రెండు కళ్ళ సిద్ధాంతం లో కూడా హింస ఎందుకు ఉన్నాడని నేను అనుకున్నానో నేను చెబుతాను.
  ఏ సిద్ధాంతం అయినా, వైఖరి అయినా - అది ఆచరణాత్మకత కలిగి ఉంటేనే ఉపయోగం. అవినీతిని వ్యతిరేకిస్తున్నాను అని బాబు గారు చెబితే, ఆయన పార్టీ అందుకు సంబంధించిన ఆచరణ లోకి దిగుతుంది. ఊరేగింపులు తీయడమో, అవినీతిపరుల దర్యాప్తు కోరడమో, తానూ స్వయంగా కొందరి గురించి పరిశోధన చేయడమో చేస్తారు. రైతాంగం ఇబ్బందుల్లో ఉన్నాడని, క్రాప్ హాలిడే అందుకు ఒక సంకేతమని చంద్రబాబు అంటే, ఆయన పార్టీ, ఆ రైతులకు మద్దతుగా నిలవదమో, ప్రభుత్వంతో పోరాదదమో చేస్తుంది. మరి రెండుకళ్ళ సిద్ధాంతం తో చేయదగిన ఆచరణ ఏది? గతంలో నిజాం రాజ్యంలో మతకలహాలు జరిగినప్పుడు, నిజాం రాజు, హిందువులు, ముస్లిములు తనకు రెండు కళ్ళు అన్నాడు. అంటే, ఏమిటి అర్థం, తనకు పక్షపాతం లేదు అని చెప్పదలచున్నాడు, అందుకు అందులోనుంచి ప్రభుత్వ యంత్రాంగం ఒక సూచనను తీసుకోవచ్చు. ఏ ఒక్క మతస్తుల పైనో కక్ష కడితే నేను ఊరుకోను- అని తమ పాలకుడు చేబుతునాడు అని అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ప్రకటనలో ఏమిటి అర్థం? దానివల్ల ఎవరికి ఏమి సంతృప్తి? దాన్ని బట్టి ఆయన పార్టీ చేసే ఆచరణ ఏమిటి? కేవలం తన నిస్సహాయతను, అవకాశవాదాన్ని వ్యక్తం చేయడానికే ఆయన ఆ మాట అన్నాడు. అవకాశవాదం అని ఎందుకు అనాలంటే, ఆయన పార్టీ పెద్ద కసరత్తు చేసి, అన్ని ప్రాంతాలకు చెందిన తన సభ్యులను సంప్రదించి, తెలంగాణా కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది. 2009 ఎన్నికల్లో ఓడిపోయినా తర్వాత అయినా, ఆ వైఖరి తప్పు అని రుజువైంది, దాన్ని ఉపసంహరించు కుంటున్నాము అని చెప్పలేదు. 2009 డిసెంబర్ ఏదో తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా ఆయన తెలంగాణా రాష్ట్రానికి అనుకూలంగానే వైఖరి చెప్పారు. మరి డిసెంబర్ 9 తరువాత ఆయనకు తెలిసిన కొత్త విషయం ఏమిటి? ప్రజల్లో స్పందనలు ఎలా ఉంటాయో తెలియకుండానే, గతంలో వైఖరులు నిర్ణయించుకున్నారా? ప్రజల నాడి తో సంబంధం లేకుండా రాజకీయాలలో ఉండడం ఎందుకు? సరే, ఒక ప్రాంతంలో ప్రజల అభిప్రాయం తెలంగాణాకు వ్యతిరేకంగా ఉన్నాడని హఠాత్తుగా ఆయనకు తెలిసిందనుకుందాం, అప్పుడు ఏం చేయాలి? అన్నీ ఆలోచించి తమ పార్టీ ఒక వైఖరి నిర్ణయించుకుంది కాబట్టి, ఆ వైఖరి మంచి చెడ్డలను ప్రజలముందుకు తీసుకువెళ్ళాలి, ప్రజలను తన వైఖరికి అనుకూలంగా మలచుకోగాలగాలి. లేదా, తన విధానాన్ని మార్చుకుని, తెలంగాణా కు చెందిన పార్టీ సభ్యులను ఒప్పించాగాలగాలి. రెండూ చేయకుండా, గోడ మీద పిల్లి వైఖరి అనుసరించడంలో హింస లేదా? ఆయన మాటను కూడా పరిగణనలో కి తీసుకుని కొందరైనా తెలంగాణా మీద ఆశలు పెట్టుకుని ఉంటారు. అంత హఠాత్తుగా మాట మారిస్తే, అది ఎందరి హృదయాలను గాయపరచి ఉంటుంది? రెండు ప్రాంతాలలో పార్టీ ఉన్నవారు ఏమి చేయగలరు? అని అమాయకంగా ప్రశ్నించవచ్చు. సీపీఎం పార్టీ ఏం చేసింది? వారికి అనుయాయులు ఇప్పుడు తెలంగాణాలోనే ఎక్కువ. అయినంత మాత్రాన వారు తమ వైఖరిని మార్చుకున్నారా? వారిని తెలంగాణా వాదులు ఎక్కడైనా ఇబ్బంది పెడుతున్నారా? బీజీపీ, సేపేఐ పార్టీలు రెండు ప్రాంతాలలో ఉన్న పార్టీలే కదా, వాళ్ళు సీమాంధ్ర లో కూడా తెలంగాణా వాదాన్ని వినిపిస్తున్నారు కదా? వారికి మాత్రం రాజకీయంగా నష్టాలు ఉండవా? అంటే, సూత్రబద్ధ వైఖరి అనుసరిస్తే రాజకీయ నష్టం కలుగుతుంది కాబట్టి, రెండు కళ్ళ సిద్ధాంతం చెబితే - దాన్ని అవకాశవాదం కాక మరేమని పిలవాలి? ఆడిన మాట తప్పడం లో హింస కనిపిచడం లేదా?

  ReplyDelete
 20. వేర్పాటు వాదం- ఒకరిని ప్రత్యర్థిగా పరిగణించి, వారి నుంచి వేరు కావాలని భావిస్తుంది. అందువల్ల, ఆ ప్రత్యర్థిని విమర్శిస్తారు, ఒక్కోసారి దూషిస్తారు. మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయే ఉద్యమంలో తమిళులని కూడా అట్లాగే నిందించారు, విమర్శించారు. కాని అందరూ కలిసి ఉండాలనే సిద్ధాంతం లో అటువంటి విమర్శకు ఆస్కారం ఉండదు. అందరూ కలసిమెలసి ఉంటే బావుంటుంది అనుకునేవారు, ఆ సమైక్యతకు దోహదం చేసే విధంగా ప్రవర్తించాలి. తెలంగాణా వాళ్లకు వ్యవసాయం రాదు, వంటలు రావు, మేం లేకపోతె తొండలు కూడా గుడ్లు పెట్టవు- వంటి మాటలు మాట్లాడితే, సమైక్యత యెట్లా సాధ్యం? ప్రేమించక పొతే చంపేస్తాను అనే ఉన్మాద ప్రేమికుడిని ఎవరు ఇష్టపడతారు చెప్పండి?

  ReplyDelete
 21. http://www.facebook.com/annaji.sekhar
  by Annaji Sekhar Gubbala on Sunday, October 2, 2011 at 4:39pm
  శ్రీనివాస్ గారి ప్రశ్నలకు జబాబులు.
  శ్రీనివాస్ గారికి....మీరు ఎంతసేపు మేము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటారు కానీ నిజాలు ఒప్పుకోరు, కనీసం నిజాలా అని ఆలోచించే ప్రయత్నం చెయ్యరు. మీడియా సహకారం లేకుండానే మీ ఉద్యమం ఇంతవరకు వచ్చిందా? మొదట జాతీయ మీడియా మీ మాటలే నమ్మింది ఇపుడుకూడా జింకా నాగరాజు లాంటి విలేఖరులు ఇండియా టైమ్స్ లాంటి పత్రికలలో మీ అబద్దాలకు రంగులు అద్ది అచ్చోత్తుతున్నారు. ఇరవై రోజులుగా జరుగుతున్న సమ్మెను పట్టించుకోవడంలేదు అన్నారు కానీ అన్ని చానల్స్ లోనూ వస్తుంద కనీసం రెండు మూడు నిముషాలు. అది చాలదా? అంటే ముప్పై నిమిషాలు తెలంగాణా చుట్టూనే తిరగాలా? అది సాధ్యమా? రెండు సంవస్తారాలనుంది రోజూ మీ ఉద్యమాన్నే కవర్ చేస్తే మరి దేశంలో ఇంకా ప్రొబ్లెంస్ లేవా? ఉండవా? ఇంక రాజగోపాల్ గురించి మాట్లాడారు మీరు. రెండువేల నాలుగులో గాని రెండువేల తోమ్మిదిలోగాని తెలంగాణా ఇస్తాం అని కాంగ్రెస్స్ పార్టీ చెప్పలేదు కానీ రెండవ ఎస్సార్సీ వేస్తాం అని చెప్పింది. రికార్డులు చూసుకోండి. కానీ మీ తెలంగాణా నాయకులు తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్దహస్తులు కాబట్టి అమాయకపు ప్రజలను నమ్మించగాలిగారు. చంపుతాం నరుకుతాం అనేవాళ్ళు రెండుపక్కలా ఉన్నారు కానీ తెలంగానావడులకు అది ఒక ఊతపదం అయిపోఇంది. ఆవేశంలో ఒకసారి అనవచ్చు కానీ అది రోజూ వాడితేనే ఎదుటివాడికి చిర్రెట్టుకోస్తుందని తెలుసుకొనే శక్తి ఆసక్తి మీకు ఉండవు రావు.

  ReplyDelete
 22. /కాని అందరూ కలిసి ఉండాలనే సిద్ధాంతం లో అటువంటి విమర్శకు ఆస్కారం ఉండదు. అందరూ కలసిమెలసి ఉంటే బావుంటుంది అనుకునేవారు, ఆ సమైక్యతకు దోహదం చేసే విధంగా ప్రవర్తించాలి/
  గొంతెమ్మకోరికల్తో మారాం చేస్తూ, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెళ్ళనీ అమ్మనా బూతులు తిడుతుంటే.. ఏ అమ్మ ఐనా చాచి మూతిమీద నాలుగిస్తే అది సమైక్యమా? వేర్పాటువాదమా? మీరే చెప్పాలి. :)
  -------
  వువ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వెత్తున లేచిన ఉద్యమం మాటేమో గాని, మీకు నిజాం రెండుకళ్ళలో శాంతి, సామరస్యం కనిపించిందంటే అది మీ భావవైశాల్యాన్ని తెలియచేస్తోంది.

  ఇక మీ రెండు కళ్ళ హింస సిద్ధాంతం మాత్రం ... చంద్రబాబు అభిమాని కాకపోయినా నాకు అర్థం కాలేదండి, నిజం తెలంగాణా మీద ఒట్టు. ప్రవీణ్ గారికి అర్థమవుతుందనుకుంటా. :D

  ReplyDelete
 23. మీ పై చర్చ, నెట్ లో జరిగే చాలా ఇతర చర్చల కంటే సమ్యమనం తో సాగింది. ఇందుకు అభినందనలు శ్రీనివాస్ గారు!మీరు చర్చ ముగించినప్పటికీ నా అభిప్రాయాలను తెలియచేస్తాను. ఒకరు నీచమైన స్థాయి లో మాట్లాడితే, ఎదుటి వారు అదే స్థాయిలో ప్రతిస్పందించగూడదు అంటూనే, తమిళులను మీరు తిట్టినపుడు, మిమ్మల్ని తెలంగాణ వారు తిట్టవచ్చు అంటూ జస్టిఫై చేస్తున్నారు.
  ఇక 1996 నుంచీ వచ్చిన ఉద్యమ సాహిత్యాన్నీ, ఒక ప్రసిధ్ధిచెందిన తటస్థ న్యాయమూర్తీ, నిపుణులతో కూడిన కమిటీ రిపోర్ట్నీ మీ వంటి మేధావులు కూడా ఒకే గాట కట్టటం ఆశ్చర్యం కలిగించింది.

  మీ వామపక్ష భావాల వలన మీకు అలా అనిపించి ఉండవచ్చును గానీ,కోస్తా పెట్టుబడిదారులు సంపాదించిన డబ్బునీ, తె రా స వారు వసూళ్ళ తో సంపాదించిన డబ్బునీ equate చేయలేము. ఒక కోణం నుంచీ అవి similar కావచ్చు. అది వేరే విషయం.

  ఇక కోస్తా లో కుల హింస గురించి: కోస్తాలో నిమ్న కులాలు అగ్ర కులాలను ఎదిరించే స్థాయి ని చేరుకోవటం వలననే ఇవి జరిగాయి. రెండు గ్లాసుల వ్యవస్థా, కొంతవరకూ గడీ వ్యవస్థా ఉన్నా తెలంగాణ లో నిమ్న కులాలు ఇంకా అగ్ర కులాలను ఎదిరించే స్థాయికి చేరుకోలేదు. ఇది తెలంగాణ లో నా ప్రత్యక్ష పరిశీలన కూడా.
  ఇక పోతే , ఒకరు ఆవేశం తో కాక రాజకీయ దురుద్దేశం తో పదే పదే తిట్లు తిడుతుంటే , ఒక సారి సహిస్తారు, రెండు సార్లు సహిస్తారు, తరువాత కూడా సహించటానికి తిట్టించుకొన్న్వారు మనుషులు కాకూడదు, దేవతలు అవ్వాలి. ఈ బలహీనతను గమనించే తెలంగాణ వాదులు తిడుతున్నారు. విద్వేషం లో ఎవరికి లాభం ఉంటే వారు దానిని రగులుస్తారు. ప్రస్తుతానికి విడిపోదామనుకొనే వారికి విద్వేషాల వలన చాలా లాభం!

  ReplyDelete
 24. ఆడిన మాట తప్పటం లో మీరు లోక హింస కనిపెట్టేశారు. కానీ దీనికంటే ముందు, హరీష్ రావు వంటి బాధ్యతాయుతమైన నాయకులు ప్రత్యక్ష భౌతిక దాడులకు దిగటం లో ని హింస ను గురించి ప్రస్తావిస్తే బాగుండేది.

  ReplyDelete
 25. ఇంటర్నెట్ లో జరిగే చర్చలతో పోలిస్తే ఈ చర్చ చాలా సమ్యమనం తో నడిచింది. శ్రీనివాస్ గారు, అభినందనలు!
  1. మీ వంటి మేధావి కి 1996 నుంచీ ఉన్న తెలంగాణ వాద లిటరేచర్ మరియూ ఒక ప్రసిధ్ధుడైన తటస్థమైన న్యాయమూర్తీ, నిపుణులతో కూడీన కమిటీ రిపోర్టూ ఒకే విధం గా కనపడటం ఒకింత ఆశ్చర్యం కలిగించింది.
  2. నీచ భాష ను ఉపయోగించే వారిని అదే స్థాయి భాష తో తిట్టకూడదంటూనె, మీరు తమిళులని తిట్టారు కాబట్టీ, మిమ్మల్ని తిట్టటం సరైనదే అని సమర్ధించుకొన్నారు.
  3. ఆంధ్ర పెట్టుబడిదారులు సంపాదించటమూ, తె రా స వారు వసూళ్ళు చేయటమూ equate చేయలేము. వామపక్ష భావాలుగల మీకు ఆ రెండూ similar గా కనపడి ఉండవచ్చు. similar అవ్వవచ్చు కానీ equal కాదు.
  4. తెలంగాణ లోనూ రెండు గ్లాసుల సంస్కృతీ, చీపురు కాళ్ళకి కట్టే విధానాలూ ఉన్నాయి. ఆంధ్ర లో నిమ్న కులాలు అగ్ర కులాలను ఎదిరించే స్థితి కి చేరుకోవటం వలన అక్కడ కుల ఘర్షణలు జరిగాయి. తెలంగాణ లో నిమ్న కులాలు ఇంకా ఎదిరించే స్థితి కి చేరుకోలేదు. ఇక ముందు ఆ స్థితికి చేరుకొంటే ఈ ఘర్షణలు జరుగ వచ్చు. ఇది సమాజ పరిణామం లోని ఒక దశ మాత్రమే! దీనిని గురించి ఎవరూ తక్కువ గా ఫీల్ అవ్వనవసరం లేదు.

  ReplyDelete
 26. తెలంగాణా గురుంచి మాట్లాడే అనేకమందికి తెలంగాణా అంటే ఏందో తెలీదు అని నాకు అర్థమయ్యింది. తెలంగాణా అంటే ఏమిటో, తెలంగాణా ఒక ప్రత్యెక రాష్ట్రం ఎందుకు కావాలో, పడి ఎందుకు కాకూడదో ఎవరూ చెప్పరు

  ReplyDelete
 27. సార్,
  బస్సు లో నిద్రపోయేవాడు విజయవాడ నుంచే నిద్రపోవటం మొదలుపెడతాడు. చూసే వాడు కంచిక చెర్లనీ, సూర్యాపేటనీ నకిరేకల్ నీ అన్నిటినీ చూస్తాడు. కంచికచెర్ల దాటగానే ఎవరూ టక్కున కళ్ళుమూసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తరువాత తెరవరు.
  మనిషనే వాడు ఒకసారి తిట్టించుకొంటాడు, రెండవసారి తిట్టించుకొంటాదు..తరువాత తిరిగి తిట్టటం మొదలుపెడతాడు. సమైక్యవాదం అన్నపాపానికి ఎన్నిసార్లు తిట్టినాపడాలంటే, మేము దేవతలం కాదు.

  ReplyDelete
 28. ప్రత్యేక తెలంగాణా పట్ల మీకున్న ప్రేమ, అంకితభావం చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. నిజంగా తెలంగాణా అభివృద్దిని కోరుకొనేవారు అయితే ఇది చెప్పండి: హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసి మిగిలిన జిల్లాలతో తెలంగాణా ఏర్పాటు చేసి ఒక ప్యాకేజీ ఇస్తే సరిపోతుందా లేక హైదరాబాదును తప్పక ప్రత్యేక తెలంగాణాలో భాగం చేయాలా?

  ReplyDelete
 29. జీడిపప్పు గారు, మీ కళ్ళు చెమర్చినందుకు కృతజ్ఞతలు. ప్రేమ సంగతేమో కానీ, దురదృష్టవశాత్తూ నాకు ఏమంత అంకిత భావం ఉన్నాడని నేను అనుకోను. తెలంగాణా ఉద్యమంలో అంకిత భావం, త్యాగ శీలత ఉన్నవారు అసంఖ్యాకంగా ఉన్నారు, అనామకంగా. వాళ్ళ కోసం నాయకులలో ప్రస్తిద్ధులలో వెదక్కండి.

  మీరు చమత్కారంగా అడిగినా, వెటకారంగా అడిగినా, హైదరాబాద్ ప్రతిపత్తి గురించి అడిగారు కాబట్టి నా అభిప్రాయం చెబుతాను. నిజానికి, ఈ బ్లాగ్ లో కొత్త పోస్ట్ లో విభజన సమస్యలను చర్చించాను. ఆసక్తి ఉంటే చదవండి.

  హక్కులు, సూత్ర బద్ధ వైఖరి వేరు, ఆచరణాత్మక పరిష్కారం వేరు. అయితే, మొదటి దాని ప్రాతిపదికనే రెండోది నిర్ణయం కావాలి. హైదరాబాద్ సహజంగా, హక్కుగా తెలంగాణాకు చెందవలసిందే. హైదరాబాద్ విస్తరించడానికి భూమినిచ్చి, తాగడానికి నీళ్ళిచ్చి, దాని నిగనిగలకు, ధగధగలకు మూల కారణం తెలంగాణా. కానీ, గత యాభై సంవత్సరాల చరిత్ర కారణంగా, ఇతరులు కూడా ఇక్కడి సమాజంలో భాగమయ్యారు. ఇక్కడ అనాదిగా స్థిరపడిన మహారాష్ట్రులవలె, తమిళుల వలె, కన్నడిగుల వలె- వారు మైనారిటీ భాషా సమూహాల వలె కాక, సమాజంలో ప్రధాన సమూహంగా మారారు. వారికీ ఇక్కడ కొన్ని హక్కులు సహజంగా సంక్రమిస్తాయి. రాష్ట్ర రాజధానిగా ఉండడం వాళ్ళ ఇతర ప్రాంతాల వారికి కూడా హైదరాబాద్ తో అనేక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. వారందరికీ రక్షణలు కల్పించవలసి ఉంది. వారికి విశ్వాసం కల్పించాలి. అయితే, తెలంగాణా ఏర్పాటు అన్నది, తెలంగాణా ప్రజల పోరాటం వల్ల సిద్ధిస్తున్నది (నిజంగా సిద్ధిస్తే). కాబట్టి, పోరాడే వారి ప్రయోజనాల సాధనకు ప్రాధాన్యం ఉంటుంది. ఆ క్రమంలో కొత్త ఏర్పాటు వల్ల ప్రయోజనాల భంగం కలుగుతుందనుకునే వారి రక్షణలను కూడా పట్టించుకోవలసి ఉంటుంది. విశాలాంధ్ర ఏర్పాటు సమయంలో జరిగినట్టు- ఒక పెద్ద మనుషుల ఒప్పందం వంటి ఏర్పాటు అవసరం. ఆ ఏర్పాటు కింద, సీమాన్ధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు అయ్యేవరకు, హైదరాబాద్ ను (స్థలాన్ని, ఆదాయాన్ని) పంచుకోవాలి. ఇక్కడ స్థిరపడి, ఇక్కడే కొనసాగాలనుకునే వారి విషయంలో పూర్తీ సమన్యాయం, సమానావకాశాలు కల్పించాలి. అందుకుగాను, 5 నుంచి 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించవలసి రావచ్చు. ఉమ్మడి రాజధాని కావాలంటే ఆ సమయంలో అది కేంద్ర పాలిత ప్రాంతమూ కావాలి. సీమాంధ్ర రాజధాని సిద్ధం అయిన తరువాత, వ్యవస్థల బదలాయింపు జరిగిన తరువాత హైదరాబాద్ పూర్తిగా తెలంగాణాకు సంక్రమించాలి. కాకపొతే, మరికొంత కాలం పాటు ఆదాయం పంచుకోవలసి రావచ్చు. ఈ విషయాలు సాగునీటి వంటి వాటి విషయంలో అందరికీ ప్రయోజనం కలిగే విధంగా ఒప్పందాలు జరగాలి. ఈ విషయాలు నిర్ణయం జరగాలంటే, ఒక ప్రత్యెక కమిషన్ నియామకం అవసరం కావచ్చు. హైదరాబాద్ పై ఎవరి హక్కు యెంత, ఎవరు చేసిన అభివృద్ధి యెంత వంటి అంశాలను నిర్ధారించి, సాగునీటి హక్కులను పంపకాన్ని ఖరారు చేయడం ఆ కమిషన్ చేయాలి. ఈ క్రమంలో కూడా తెలంగాణా చాలా కోల్పోవలసి రావచ్చును కాని, శాశ్వతంగా స్వయం నిర్ణయాధికారం సిద్ధిస్తుంది కాబట్టి సర్దుబాటు తప్పదు.

  ReplyDelete
 30. సర్,
  చాలా ఆసక్తి కరమైన ప్రతిపాదనలు చేసారు...
  చాలా ఆశ్చర్యంగా కూడా అన్పించాయి.. మీరు సూచించిన ఈ అంశాలు...మెజారిటీ తెలంగాణా వాదులకు కూడా ఆమోదయోగ్యమైనవిగా భావించవచ్చా?
  మల్లీశ్వరి

  ReplyDelete
 31. శ్రీనివాస్ గారు,మీరన్నారు "హైదరాబాద్ విస్తరించడానికి భూమినిచ్చి, తాగడానికి నీళ్ళిచ్చి, దాని నిగనిగలకు, ధగధగలకు మూల కారణం తెలంగాణా".ఇవన్నీ ఉచితంగా ఇచ్చారా?ఉంటే కొన్ని ఉదహరించండి.

  ReplyDelete
 32. పాపం ఆంధ్రుడు పేరుతొ రాసిన చదువరి మంచి ఆసక్తి కరమైన అంశాలు లేవనెత్తారు. వారికి జవాబు చెప్పాలనిపించింది. పదిహేనేళ్ళ కాలం నుంచి వచ్చిన తెలంగాణా వాద వాంగ్మయమూ, శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ రెండూ ఒకటేనా అన్నారు ఆయన. రెండూ ఒకటే అనలేదు. కమిటీ రిపోర్ట్ నిన్న గాక మొన్న వచ్చింది. తెలంగాణా వారు ఏమి కోరుతున్నారు, ఏమి మాట్లాడుతున్నారు అన్న విషయాలు 15 సంవత్సరాల నుంచి అందుబాటులోనే ఉన్నాయని, వాటి పై ఆ కాలంలోనే చర్చకు దిగి ఉండవచ్చునని నా భావం. ఇంతకాలం వచ్చిన వాదనలను విస్మరించి, ఇప్పుడు మొదటినుంచి అమాయకంగా ప్రశ్నలు వేయడం న్యాయం కాదు. జస్టిస్ శ్రీ కృష్ణ మీద అందరితో పాటు నాకు కూడా గౌరవం ఉన్నది. ఆయన గతంలో ప్రశంసనీయమైన నివేదికలు ఇచ్చారు. అయితే, కమిటీలు, కమిషన్లు ఇచ్చే నివేదికలు అన్ని సమయాల్లో ఉత్తమమైనవిగా ఉండాలని ఏమీలేదు.కొన్ని సందర్భాలలో నివేదికలు నిక్కచ్చిగా ఉంటాయి, ప్రభుత్వం వాటిని చెత్త బుట్టలో పడేస్తుంది. కొన్నిసార్లు నివేదికలే ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటాయి. మా పాత్రికేయ సహచరుడు గులాం రసూల్ ను పోలీసులు 1991 లో బూటకపు ఎన్కౌంటర్ లో చంపేశారు. అతని మరణం యెట్లా జరిగిందో బహిరంగ రహస్యం. కానీ, దాని మీద విచారించిన కమిషన్ అది నిజమైన ఎన్కౌంటర్ అని, ఆటను నిజంగా నక్సలైట్ అని నిర్ధారించింది. కృష్ణ కమిటి తగినంత అధ్యయనం లేకుండా, ద్వితీయ శ్రేణి సమాచారం ఆధారంగా, ప్రభుత్వాధికారులు ఇచ్చిన గణాంకాల ఆధారంగా నివేదికను రాసినట్టు అనిపిస్తోంది. ఏ నది కి ఏది ఉపనదో తెలియదు. ఏ పరిశ్రమ ఏ ప్రాంతంలో ఉన్నదో తెలియదు. కాల్వ కింది వ్యవసాయానికి, మెట్ట వ్యవసాయానికి ఉండే తేడా తెలియదు. నివేదికను ఒక సారి పూర్తిగా చదవండి, ఆ కమిటి ప్రాతిపదికగా తీసుకున్న అవగాహన కూడా యెంత లోపభూయిష్టమో తెలుస్తుంది. సరే, శ్రీ కృష్ణ కమిటి నివేదిక ఇక్కడ చర్చనీయాంశం కాదు. తెలంగాణావాదులు ఎప్పటినుంచో చేస్తున్న వాదనల తో పరిచయం ఉంటే, పాతబడిన, అరిగిపోయిన వాదనలు ఇతరులు చేసి ఉండేవారు కాదు. వేరే స్థాయిలో చర్చ జరిగితే ఉపయోగం గా ఉండేదని మాత్రమే నా ఉద్దేశం.
  ఇక రెండో అంశం, తిట్టు సంస్కృతి గతంలో జరిగినా ఇప్పుడు జరిగినా రేపు జరిగినా ఎవరు చేసినా తప్పే. అది సూత్ర బద్ధ వైఖరి. కానీ దురదృష్ట వశాత్తూ అటువంటిది ఉనికిలో ఉన్నదనుకోండి. దాని మీద జరిగే చర్చ వేరుగా ఉండవలసి వస్తుంది . తెలంగాణా వారు మాత్రమే తిట్టడం లేదు అని చెప్పడానికి చెప్పాను. తిట్లనే విశ్లేషించి చూడండి. తెలంగాణా వారు సీమాన్ద్రులను దోపిదీదార్లు, వలస వాదులు అంటున్నారు. సీమాన్ధ్రులు తెలంగాణా వారికి సంస్కృతి లేదని, వ్యవసాయం రాదనీ, రాళ్ళూ గుట్టలూ ఉంటే తాము వచ్చి అభివృద్ధి పరచామని అంటున్నారు. రెండు రకాల విమర్శల్లో జాగ్రత్త గా పరిశీలిస్తే, వారి వారి వైఖరులు తెలుస్తాయి.

  ReplyDelete
 33. మూడో అంశం- తెలంగాణా ఉద్యమ నాయకులు, ముఖ్యంగా తె రా స వాళ్ళు వసూళ్ళకు పాల్పడుతున్నారని, సొమ్ము పోగేసు కుంటున్నారని విమర్శ, ముఖ్యంగా సీమాంధ్ర నేతల నుంచి వస్తున్నది. ప్రజలు అమాయకులని, నేతలు దుర్మార్గులని అనడం ఒక వ్యూహం. ఉద్యమంలో వసూళ్లు జరగడం లేదని నేను అనడంలేదు. అన్ని రకాల వసూళ్లు సమర్తనీయమని అనడంలేదు. కాని, ఏ పార్టీ వసూళ్లు చేయడం లేదు? ప్రయోజనాలు అందించడానికి, హాని జరక్కుండా ఉండడాని, రక్షణ కల్పించడానికి - పరిశ్రమల నుంచి, సంపన్నుల నుంచి డబ్బు తీసుకొని పార్టీ ఏది? ఒక కాంగ్రెస్ ప్లేనరి కి , ఒక దేశం మహానాడుకి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? మరి నిత్యం ఉద్యమాలు నిర్వహించవలసిన పార్టీకి ఖర్చులు యెట్లా? కైంకర్యం చేసేవారి సంగతి పక్కన పెట్టండి. వసూళ్లు అన్న మాటను మనం ఉద్యమం మీద దాడి చేయడానికి అంటున్నామా, నిజంగానే అవినీతి పరుల మీద కోపంతో అంటున్నామా- ఆలోచించుకోవాలి.
  నాలుగో అంశం- రెండు ప్రాంతాలలో సామాజిక స్థితిగతుల మీద మంచి వ్యాఖ్య చేసారు. తెలంగాణలో అర్థ భూస్వామ్య, కులవాద చిహ్నాలు ఇంకా అక్కడక్కడా ఉన్న మాట నిజమే కానీ, కుల ఉద్రిక్తతలు ప్రబలంగా లేకపోవడానికి కారణం- ఇక్కడ మూడు దశాబ్దాలపాటు సాగిన విప్లవ ఉద్యమం. ఆ ప్రభావం వల్ల, కులాల మధ్య ఒక దైనందిన జీవన అవగాహన సాధ్య పడింది. కోస్తా ప్రాంతాలలో దళితులలో అగ్ర కులాలలను ఎదిరించే చైతన్యం వచ్చింది అన్నారు. నిజమే. అక్కడ అగ్ర కులాలలో వచ్చిన అభివృద్ధి తో పాటు కింది కులాలలో కూడా ఆర్థికంగా విద్యావిషయికంగా ఎదుగుదల వచ్చింది, చైతన్యమూ వచ్చింది. తెలంగాణా పరిస్థితి ఏమిటంటే ఇక్కడ అగ్ర కులాలలోనే, ఆర్ధిక, విద్యా వికాసాలు మందకొడిగా సాగాయి. అగ్ర-నిమ్న కులాల మధ్య అభివృద్ధి కలిగించే పోటీ కానీ, వైషమ్యం కానీ ఇక్కడ లేవు. ఎప్పుడో దశాబ్దాల నాటి గడీలను, వెట్టి చాకిరీని, దొరతనాన్నీ ఇప్పటి తెలంగాణాకు కూడా ఆపాదించకండి. అతి స్వల్ప సంఖ్యలో ఉన్న భూస్వామ్య, సంపన్న శ్రేణి (వారు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు) మినహాయిస్తే , తక్కిన తెలంగాణా లో ఆర్ధిక వ్యత్యాసాలు శిఖర-అగాధ స్థాయిలో లేవు. అందువల్లనే ఉద్యమంలో వివిధ వర్గాల మధ్య, కులాల మధ్య ఐక్యత సాధ్యపడింది. సాయుధ మిలిటంట్ పోరాటాలు చేసిన అనుభవం ఉన్న తెలంగాణా ప్రజలు, రేపు కొత్త తెలంగాణా లో ప్రభువులు పాత గుణం చూపిస్తే సహిస్తారా? తెలంగాణా నిమ్న ప్రజానీకం మీద అంత ప్రేమ, దొరల మీద ఇంత వ్యతిరేకత ప్రకటిస్తున్న కోస్తాంధ్ర వాదులు - మరి ఎందుకు భూస్వాముల పక్షాన నిలిచి ప్రజలను అణచివేశారు?

  ReplyDelete
 34. చాణుక్య గారు వేసిన ప్రశ్న ఆసక్తికరమైనది. హైదరాబాద్ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది ఇటువంటి ప్రశ్న వేస్తుంటారు. ఇందులో రెండు మూడు ఇతర అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. హైదరాబాదు కే కాదు, ఏ పట్టణం విషయంలో అయినా వర్తించే వ్యాఖ్య నేను చేసాను. ఏ పట్టణం అయినా సహజంగా ఎవరికి చెందుతుంది? ఆ పట్టణం ఆ పట్టణ వాసులకే చెందుతుంది అని ఒక సమాధానం రావచ్చు. కాని ఏ పట్టణం అయినా స్వయం పోషకం కాదు. కొంత కటువుగా వ్యాఖ్యానించాలంటే పట్టణాలు పరాన్నభుక్కులు. పల్లెల్లో ఆహారాన్ని, ఇతర నిత్యావసరాల్ని ఉత్పత్తి చేస్తుంటే, ఇతర ఉత్పత్తులను సేవలను అందించేవారు, ఆ ఉత్పత్తుల మీద డబ్బు చేసుకునేవారు, ఉద్యోగులు- పట్టణాల్లో జీవిస్తారు. పల్లెల కంటే ఎక్కువ ఆదాయాన్ని, సదుపాయాల్ని విలాసాల్ని పొందుతారు. మరి, పట్టణ వాసులకు ఆహారం ఎక్కడినుంచి వస్తుంది? వారికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి. నగరం విస్తరించడానికి కావలసిన నేల ఎవరిస్తారు?
  నీటికి మీటర్ కడుతున్నాం కదా, నేల ను కొనుక్కుంటున్నాం కదా- అని జవాబు చెప్పవచ్చు. కాని, డబ్బుకు అన్నీ దొరుకుతాయా? డబ్బులిస్తాము, పంటలకు నీళ్ళు మానేసి బెజవాడ పట్టణానికే నీల్లిమ్మని అడిగితె కృష్ణా రైతులు అంగీకరిస్తారా? పట్టణాన్ని విస్తరిస్తాము అని పంటపొలాలను ప్లాట్స్ గా మార్చే ప్రక్రియకు పల్లెవాసులు అంగీకరిస్తారా? ఎందుకు సోంపేట రైతులు థెర్మల్ ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తున్నారు? ఎన్ని డబ్బులిచ్చినా జీవనాధారాలను దెబ్బ తీసుకోవడానికి ప్రజలు ఒప్పుకోరు, ఆ ప్రజల మీద అధికారం సాధిస్తే తప్ప.
  జంట జలాశయాలు నిర్మించినప్పుడు 1920 లో, అవి హైదరాబాద్ కు రెండు దశాబ్దాల దాకా సరిపోతాయని ఆశించారు. ఇప్పుడు, సింగూరు జలాలు వాడుతున్నాము, కృష్ణా జలాలు వాడుతున్నాము, గోదావరి నీళ్ళ కోసమూ ప్రయత్నిస్తున్నాము. ఆ నీళ్ళు ఎవరివి? నగర విస్తరణలో మాయమైపోయిన పల్లెలు ఎవరివి? ఆ పల్లె వాసులు ఇప్పుడెక్కడ ఉన్నారు? కాసిని డబ్బుల కోసమే, అమ్ముకుని ఉండవచ్చు, కాని నగర అభివృద్ధిలో వారి పాత్ర లేదా?
  నదుల విషయంలో రిపెరియన్ రైట్స్ అంటారు. పరీవాహక ప్రాంతం ఉండే ప్రాంతానికే నది మీద హక్కులు ఉంటాయి. నది లాగే , పట్టణం కూడా పరిసర ప్రాంతాల నుంచే తన ముఖ్య వనరులను సమకూర్చుకుంటుంది. ఆ వనరులు అందించే వారికే దాని మీద సహజ హక్కు ఉంటుంది.

  ReplyDelete
 35. వెనుకటికి మా ఊర్లో 'గ్రామం' చెప్పింది అనే పద ప్రయోగం వాడేవాళ్ళు, తమకు తాము ఏదైనా సమర్ధించుకోలేనప్పుడు.. ఆ పదం వాడినప్పుడు అధికార్లు ఎవడ్ని అడగాలో అర్ధమయ్యేది కాదు..

  అలానే శ్రీనివాస్ గారు కూడా పల్లెలు ఇచ్చాయి అని చెప్తుంటే ఇదే గుర్తుకు వస్తుంది. పల్లె ఇచ్చి ఎక్కడికి వెళ్ళిపోయింది? పట్టణం లో భాగం కాలేదా? వ్యక్తులుగా భూములిచ్చినవారికి తగినంత నష్టపరిహారం కోరే హక్కు ఉంటుంది.. అంతవరకే.. కాని ఆ భూమి తీసుకున్న నగరం పై, దాని భవిష్యత్తు పై ప్రత్యేక హక్కు ఏమి ధఖలు పడదు..

  ఇంక శ్రీనివాస్ గారికి తెలీదేమో.. జలవనరుల విషయం లో తాగునీటికే తొలి ప్రాధాన్యత... అది విజయవాడ అయినా, సింగూర్ అయినా.. అందుకే ఈనాడు మనం చెన్నై నగరానికి పనిగట్టుకొని నీళ్ళు తరలిస్తుంది. పంట పొలాలను స్వచ్చందంగా ఫ్లాట్స్ గా అమ్ముకొని కోట్లు గడించిన వ్యక్తులు ఎందరు లేరు?

  పరీవాహిక ప్రాంతానికి కాదు. రివర్ బేసిన్స్ అని ఉంటాయి,. వాటిననుసరించి నీటి కేటాయింపులుంటాయి గానీ నా ఇంటి ముందున్న సముద్రం మొత్తం నాదే అన్నట్లు చట్టాలుండవు. ఇటువంటి చిల్లర తగాదాలు వస్తాయనే నదీ జలాల పంపకాన్ని కేంద్రం చేతుల్లో పెట్టారు. హైదరాబాద్ కృష్ణా రివర్ బేసిన్ లో ఉన్నది కాబట్టి దానికి నీటిని కేటాయించాల్సిన భాద్యత ఆయా ప్రభుత్వాలు చూసుకుంటాయి. అంతేకాని ఫలానా చోటో, ఫలానా ప్రాంతం తో కలిసుంటేనే నీళ్ళు.. లేదంటే మీకు ఇవ్వం అనే చిన్నపిల్లల తరహా గా అలోచించటం పెద్దలకు విఙ్ఞత కాదు.

  ReplyDelete